ఎమోషన్ ను మిస్ చేయని మురుగదాస్
మురుగదాస్ సినిమాలకు ఉండే ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో తనదైన క్రియేటివితో యాక్షన్ సీన్స్ హైలైట్ అవుతుంటాయి. మురుగదాస్ కథలు నేచురల్‌గానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తాడు. ఆయన సినిమాల్లో ఎమోషన్ ఎలా ఉంటుందో చివర్లో మెసేజ్ కూడా అంతే కచ్ఛితంగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే మురుగదాస్ ముందు ఒక మెసేజ్ అనుకుని దాన్నుంచే కథ రాయడం మొదలుపెడతాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని యాక్షన్ ను చూస్తారని మేకర్స్ సినిమా అనౌన్స్మెంట్ రోజే చెప్పారు.
సికిందర్ లో కూడా మురుగదాస్ ఎమోషన్ ను మిస్ చేయకుండా యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని మలుస్తున్నాడట. కొన్ని సీన్స్ ఆడియన్స్ తో కన్నీరు పెట్టాస్తాయని, ఆ సీన్స్ లో సల్మాన్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, క్లైమాక్స్ లో మురుగదాస్ మార్క్ మెసేజ్ ఉంటుందని చిత్ర వర్గాల నుంచి లీకులందుతున్నాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.













