దేవర ప్రమోషన్స్‌కు ముహూర్తం పెట్టేశారా?
జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న భారీ సినిమా దేవర. రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టడానికి దేవర బృందం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే డిసెంబర్ రెండో వారంలో దేవర నుంచి ఓ స్పెషల్ అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి ఒకే టీజర్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఐడియా ఇవ్వడంతో దానికి కొరటాల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర యూనిట్ మొత్తం ఈ విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారట.
టీజర్ తర్వాత పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అనిరుధ్ తమ అభిమాన హీరో సినిమాకు మొదటి సారి పనిచేస్తుండటంతో ఈ సినిమా సాంగ్స్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా మ్యూజిక్ కు మంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. మరి ఇన్ని అంచనాల మధ్య దేవర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.













