ముగ్గురు మొనగాళ్లు ప్రీ రిలీజ్ వేడుక
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్‌రెడ్డి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న చిత్రం ముగ్గురు మొనగాళ్లు. చిత్ర మందిర్ బ్యానర్‌పై అఖిలాష్రెడ్డి దర్శకత్వంలో పి. అచ్యుత రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (వీడియో ద్వారా) మాట్లాడారు. నటుడిగా అందరికీ సుపరి చితమైన రామారావుగారు నిర్మించిన మొనగాళ్లు ఒకపుడు చిరంజీవిగారితో తాను చేశానని తెలిపారు. అదే టైటల్‌తో డిఫరెంట్ కథతో సినిమా చేశారని టీజర్, ట్రైలర్ చూశానని సినిమా చాలా బావుందన్నారు. యూనిట్‌కు అల్ది బెస్ట్ అని తెలిపారు. కార్యక్రమంలో వీడియో ద్వారా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దనరెడ్డి, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మాట్లాడారు. బిగ్‌బాస్ ఫేం సోహైల్, అరియానా, రైటర్ బివిఎస్ రవి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, అంజి, అచ్చుత రామారావు, డైరెక్టర్ అభిరాష్ రెడ్డి, నటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ దీక్షిత్ రెడ్డి తదితరులు మాట్లాడారు.













