రామ్ యూనిక్ కో స్టార్ అంటున్న సీత
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్, తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఈ మూవీ తరువాత మృణాల్ కి వరుస సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, నాని తో సైన్ చేసిన సినిమాలు షూటింగ్ ప్రక్రియలో ఉండగా మాస్ మహారాజ్ రవితేజతో కూడా జోడిగా ఈ అమ్మడు నటిస్తుంది. అయితే ఈ మూవీ కి దర్శకత్వం మలినేని గోపీచంద్. ఇలా వరుస అవకాశాలు తన కైవసం చేసుకొంటుంది మృణాల్.
ఇదిలా ఉంటే మహానటి, సీతారామం క్రేజ్ తో తెలుగు లో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకొన్నాడు దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వం లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ జులై 28 న తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసారు. దుల్కర్ ప్రస్తుతం కింగ్ అఫ్ కోత అనే సినిమా పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధిన మొదటి సాంగ్ కూడా తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసారు.
దుల్కర్ సల్మాన్ బర్త్ డే కారణంగా మృణాల్ తనకి విషెస్ తెలియచేసింది. ఈ విషెస్ తన సోషల్ మీడియా అయినా ఇన్స్టాగ్రామ్ ద్వారా విష్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మృణాల్ షేర్ చేసిన ఫోటోలు వాళ్ళు ఇద్దరు కలిసి నటించిన సీతారామం మూవీ సమయంలో తీసుకున్న ఫొటోలను చూస్తుంటే తెలుస్తోంది. ‘దుల్కర్ ఒక అద్భుతమైన కోస్టార్ అని యూనిక్ యాక్టర్ అని దుల్కర్ లాంటి హీరోని నాకు పరిచయం చేసిన సీతారామం నిర్మాతలకి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దుల్కర్ కి తన విషెస్ ని తెలియచేసింది సీత. దానికి దుల్కర్ కూడా సల్మాన్ తనదైన పద్దతిలో రిప్లై ఇచ్చారు.













