తమిళ స్టార్ తో జతకట్టనున్న సీతారామం బ్యూటీ…
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మధుర కావ్యం సీతారామం. ఈ చిత్రంలో కథానాయికగా టాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఆడియన్స్ మనసులో సీతగా నిలిచిపోయింది మృణాల్. విమర్శకుల ప్రశంసల్ని సైతం ఈ అమ్మడు అందుకోవడం విశేషం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది మృణాల్ ఠాకూర్.
సీతారామం సినిమా తర్వాత హీరో నాని సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అమ్మడు. హిందీ సీరియల్స్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రెసెంట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ లో సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించింది. తాజాగా ఈ మరాఠి బ్యూటీ కి తమిళ ఇండస్ట్రీ నుండి క్రేజీ ఆఫర్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన హీరోయిన్ గా మృణాల్ కి నటించే అవకాశం వచ్చిందని సమాచారం.
తమిళ దర్శకుడు శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ” సిరుతై ” మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కబోతుంది, ఈ పీరియాడిక్ సీన్స్ లో మృణాల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటాయి. పాన్ ఇండియా సినిమాగా విడుదలకి సిద్ధమవుతున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ యువీ క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సూర్య సరసన మరొక హీరోయిన్ గా దిశా పటాని నటించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.













