రూటు మారుస్తోన్న మృణాల్
సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో దూసుకెళ్తున్న మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మెల్లిమెల్లిగా తన రూటును మార్చి మాస్ వైపు మొగ్గు చూపిస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియ ప్రాజెక్ట్ లో మృణాల్నే హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా స్క్రిప్ట్ కోసం టైం ఎక్కువగా తీసుకున్న మురుగదాస్ దాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు మల్టీస్టారర్ హంగులుంటాయని తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించగా, ఆయన దాదాపు ఓకే అన్నట్లు సమాచారం. పవర్ఫుల్ క్యారెక్టర్లకు అతికినట్లు సరిపోతారు కాబట్టి ఆయన్ను సంప్రదించారని, పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగాయని అంటున్నారు.
అంతేకాదు తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ తో పాటూ టాలీవుడ్ కు చెందిన ఓ మీడియం స్టార్ హీరో కూడా ఇందులో భాగం చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాలో మృణాల్ మాస్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో గ్లామర్ షోలకు సైతం ఓకే అంటున్న మృణాల్, సౌత్ లో మాత్రం హోమ్లీ పాత్రలు మాత్రమే చేస్తుంది. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తర్వాత టాలీవుడ్ లో కూడా రెమ్యూనరేషన్ ను పెంచాలని చూస్తుందట మృణాల్.













