ప్రేమలో ఉన్న మృణాల్
సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే స్టార్ అయిపోయింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన మృణాల్, సీతారామం సినిమాలో తెలుగింటి అమ్మాయిలా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ ప్రేక్షకుల్ని కవ్విస్తూనే ఉంది.
సీతారామం సక్సెస్తో వరుస ఛాన్సులు అందుకుంటున్న మృణాల్ రీసెంట్గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి వార్తల్లోకెక్కింది. మృణాల్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఆమెను ప్రేమించే వారు కూడా ఉంటారు. వారిందరిదీ వన్ సైడ్ లవ్. అలాగే మృణాల్ కూడా ఒకరితో వన్ సైడ్ లవ్ లోఉన్నట్లు వెల్లడించింది.
హాలీవుడ్ నటుడు కీను రీవ్స్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని, ఆయనతో తనది వన్ సైడ్ లవ్ అని, చిన్నతనంలోనే ఆయన్ను చూసి తను ప్రేమలో పడినట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. అంతే కాదు, తాను కీను రీవ్స్ లాంటి వ్యక్తిని జీవిత భాగస్వామి కోరకుంటున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే మృణాల్ ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న సినిమా చేస్తుంది.













