బాలీవుడ్లో సీతను అసలు పట్టించుకోట్లేదు
హిందీలో సో సో గా కెరీర్‌ని నెట్టుకొస్తున్న మృణాల్ ఠాకూర్‌కు అన్నీ ఉన్నా కాలం కలిసిరాక టాప్ ప్లేస్‌కి చేరుకోలేకపోయింది. కానీ ఏ ముహూర్తాన హను రాఘవపూడి ఆమెతో సీత పాత్ర చేయించాడో కానీ అప్పటినుంచి అందరూ ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. సీతారామమ్ బ్లాక్ బస్టర్ అవడం, సీత పాత్రలో మృణాల్ చేసిన మ్యాజిక్ అందరినీ మెస్మరైజ్ చేసింది.
సీతారామమ్ తర్వాత మృణాల్‌కు చాలానే ఆఫర్లు వచ్చాయి కానీ తొందరపడి ఏదీ ఒప్పుకోకుండా, చాలా జాగ్రత్తగా ఆలోచించి సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పటికే నాని30లో మృణాల్ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం కూడా మృణాల్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదంతా పక్కనపెడితే రీసెంట్గా రిలీజైన సెల్ఫీ సినిమాలో మృణాల్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అక్షయ్ కుమార్‌తో అయితే ఆడిపాడింది కానీ ఈ సాంగ్ చేయడం వల్ల ఆమెకు ఒరిగిందేమీ లేదు. అసలు సెల్ఫీ సినిమానే ఎవరూ పట్టించుకోనప్పుడు ఇక మృణాల్ చేసిన ఆ సాంగ్‌ను ఎవరు పట్టించుకుంటారు? దీంతో ఆమె కష్టమంతా వృధానే అయింది.
సెల్ఫీ హిట్ అయితే మంచి ఛాన్సులు వస్తాయనుకుంది మృణాల్. కానీ ఆ సినిమా బాలీవుడ్ టాప్ టెన్ డిజాస్టర్స్ వైపు పరుగులు తీస్తోంది. సినిమా అంత దారుణంగా లేకపోయినా సరే అక్షయ్ మీద ఉన్న నెగిటివిటీ సినిమాపై బాగా పడింది. దీంతో మృణాల్ ఇప్పటికైనా టాలీవుడ్ పై ఫోకస్ పెడితే మంచిదంటున్నారు విశ్లేషకులు. అన్నీ బాగుండి చరణ్ పక్కన ఛాన్స్ వస్తే టాప్ లీగ్‌కు వెళ్లే ఛాన్సుంది. మరి మృణాల్ మనసులో ఏముందో తనకే తెలియాలి.













