సైలెంట్ గా ఉన్న ‘సీతారామం’ హీరోయిన్
రీసెంట్ గా సీతారామం సినిమాలో హీరోయిన్ సీత పాత్రతో నటించిన మరాఠీ బ్యూటీ ‘మృణాల్ ఠాకూర్’ తెలుగు ప్రేక్షకులకు ఎంతగా దగ్గర అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ ఈ అమ్మడికి భారీ ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది. టీనేజ్ కుర్రకారుకి క్రేజీ బ్యూటీగా మారిపోయింది మృణాల్. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క తెలుగు సినిమాతో దక్కించుకుంది.
అంత ఫేమస్ అయిన హీరోయిన్ తెలుగులో నటిగా బిజీ అవ్వలేదు. కోటి రూపాయలు పారితోషికం డిమాండ్ చేసే సీన్ ఉండి కూడా ఇంకా తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ కి కూడా ఓకే చెప్పలేదు. ఈ అమ్మడి కెరీర్ నత్తనడక నడుస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సీతారామం రిలీజై ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయింది. హిందీ లో మూడు సినిమాలు చేస్తున్నా..అవేమి భారీ సినిమాలు కావు.
తెలుగులో ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఇప్పటివరకు ఏ సినిమాకి సైన్ చెయ్యకపోవడం అన్నది సీత అభిమానుల్ని కలవరపెడుతుంది. చూస్తుంటే కీర్తి సురేష్ తరహాలోనే ఈ అమ్మడి కెరీర్ ఉంటున్నట్టు అనిపిస్తుంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నా హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేదు. గట్టిగా చెప్పుకునే సినిమా ‘సర్కారు వారి పాట’ మినహా మరొకటి కనిపించదు. కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పరిస్థితి అలాగే కనిపిస్తుంది. కొత్త సినిమాలు కావాలని చేయడం లేదా? సీత లాంటి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తుందా? లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కోసం వెయిట్ చేస్తుందా? అనే విషయం లో ఎలాంటి క్లారిటీ లేదు.
అందుకే వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకుంటుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి ఈ అమ్మడు వంటబట్టించుకోవాలి. క్రేజ్ ఉన్నపుడే అవకాశాలని అందిపుచ్చుకోవాలి, అది చేజారిన తర్వాత చేసేదేమి ఉండదు. ఇప్పటికే మృణాల్ పేరు జనాలు మర్చిపోయే స్టేజ్ కి వచ్చేసారు.













