బంపరాఫర్ కొట్టేసిన మృణాల్
సీతారామంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మృణాల్ ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న మృణాల్ టాలీవుడ్ లోకి రాకముందే బాలీవుడ్ లో సినిమాలు చేసింది.
ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్ లో కూడా బిజీ అవుతోంది. తాజాగా మృణాల్ అజయ్ దేవగన్, సంజయ్ దత్ హీరోలుగా నటిస్తున్న సన్ ఆఫ్ సర్దార్2 లో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్ లో మొదలుకానుంది. ఆ దేశంలోని పలు ప్రదేశాల్లో సన్ ఆఫ్ సర్దార్2 ప్రధాన షూటింగ్ జరగనుంది.
విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా వినోదాత్మకంగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమలో మృణాల్ పాత్ర ఎంత కీలకంగా ఉండనుందట. రీసెంట్ గా తెలుగులో కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన మృణాల్ తన నటనతో ఆ పాత్ర ఎలివేట్ అయ్యేలా చేసింది. మరికొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.













