మృణాల్ కు కోలీవుడ్ ఆఫర్
గతేడాది సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ అందుకుందామనుకునే టైమ్ లో ఆ సినిమా రిజల్ట్ షాకిచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ తర్వాత మృణాల్ కు కొత్త సినిమాలేవీ రాలేదు.
ఆఫర్లు తగ్గిపోయాయో లేక మెల్లగా సినిమాలు చేద్దామనుకుందో కానీ మొత్తానికి మాత్రం అమ్మడికి ఛాన్సులు రాలేదు. మొన్నీమధ్య ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న పీరియాడిక్ సినిమాలో మృణాల్ పేరే పరిశీలనలో ఉందని టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన వచ్చింది లేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా మృణాల్ కు కోలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
లారెన్స్ హీరోగా రానున్న కాంచన4 లో తన సరసన నటించమని లారెన్స్ మృణాల్ ను అడిగినట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ముని, కాంచన సిరీస్ లో హీరోయిన్ కు అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. భయంతో అరవడానికో లేదా హీరో పక్కన డ్యాన్సులు చేయడానికో ఎక్కువ వాడుకుంటారు తప్పించి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. మరి ఈ పాత్రకు మృణాల్ ఓకే అంటుందో లేదో చూడాలి.













