మృణాల్ కు మరో బంపరాఫర్?
టాలీవుడ్ లో చేసిన మొదటి రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్లు అవడంతో మృణాల్ ఠాకూర్ కు అవకాశాలు జోరుగా వస్తున్నాయి. అయినప్పటికీ వచ్చిన ప్రతీ ఛాన్సునీ అందుకోకుండా అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది మృణాల్. సీతారామం తర్వాత హాయ్ నాన్నలో పాపకు తల్లిగా నటించినా ఎఫెక్ట్ తనకు వచ్చే ఆఫర్ల మీద పడలేదు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో కూడా మృణాల్ కు మంచి పాత్ర దక్కిందంటున్నారు. ఇదిలా ఉంటే హను రాఘవపూడి, ప్రభాస్ కాంబోలో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ని తీసుకోవాలని డైరెక్టర్ ఆలోచిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. సీతారామంలో ఆమెను ఎంతో హుందాగా చూపించిన హను, మరోసారి ఆమె కోసం అలాంటి పాత్రనే ప్లాన్ చేశాడట.
ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. స్క్రిప్ట్ వర్క్ ఆఖరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కు చాలా టైమ్ ఉండటంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను చాలా ప్లాన్డ్ గా పూర్తి చేస్తున్నారు టీమ్. ఈ సినిమాలో మృణాల్ ఫైనల్ అయితే మాత్రం అమ్మడి దశ తిరిగినట్లే. ఇప్పటికే చిరూ విశ్వంభరలో కూడా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. కానీ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఏదేమైనా తనకు వచ్చిన ఆఫర్లను చాలా జాగ్రత్తగా వాడుకుంటూ మృణాల్ తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంది.













