నేను చెప్పింది జరక్కపోతే పేరు మార్చుకుంటా మృణాల్
సినిమా ప్రమోషన్స్ లో హీరోలు ఏదేదో చెప్తుంటారు. ఎన్నెన్నో ప్రామిస్ లు, సవాళ్లు చేస్తుంటారు. రిజల్ట్ తర్వాత ఆడియన్స్ కు అసలు విషయం తెలిసిపోతుంది కాబట్టి సైలెంట్ అయిపోతారు. కానీ హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ రిలీజ్ కు ముందు సవాళ్లు చేయరు. ఇప్పటివరకు అలా ఎవరూ చేయలేదు కూడా. ఫస్ట్ టైమ్ ముంబై హీరోయిన్ మృణాళ్ ఠాకూర్, మీడియా ముఖంగా తెలుగు ఆడియన్స్ కు ఓ సవాల్ విసిరింది.
నేచురల్ స్టార్ నాని, మృణాల్ జంటగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో మృణాల్ ఎవరూ ఊహించని విధంగా మాట్లాడి, అందరినీ షాక్ కు గురయ్యేలా చేసింది. గతంలో సీతారామం సినిమా ప్రమోషన్స్ కోసం వైజాగ్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంది మృణాల్.
హాయ్ నాన్న గురించి మాట్లాడుతూ, తెలుగమ్మాయిలా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్న మృణాల్, ఈ సినిమాలో నాని- కియారా పెర్ఫార్మెన్స్ అందర్నీ ఇంప్రెస్ చేస్తుందని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ తండ్రీ-కూతురు ప్రేమలో పడిపోతారని, అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా అని సవాల్ విసిరడంతో ఇప్పుడా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.













