ప్రభాస్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన మృణాల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత వరుస డిజాస్టర్లు పడటంతో ప్రభాస్ ను అందరూ తక్కువ అంచనా వేశారు. కానీ సలార్, కల్కితో తన స్థాయి ఏంటో అందరికీ నిరూపించాడు ప్రభాస్. ప్రభాస్ నుంచి తర్వాతి సినిమాగా రాజా సాబ్ సినిమా సమ్మర్ లో రానుంది.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ప్రశాంత్ నీల్ తో సలార్2, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ లైన్ లో ఉన్నాయి. కానీ వాటిని వెనక్కు నెట్టి మరీ హను రాఘవపూడితో ఫౌజి అనే వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నట్లు రీసెంట్ గా వార్తలొచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా మృణాల్ నటించనుందని అందరూ అంటున్నారు.
తాజాగా ఓ నెటిజన్ మృణాల్, ప్రభాస్ ఉన్న ఒక ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ ఫౌజి ఫస్ట్ లుక్ అని పోస్ట్ చేశాడు. దీనిపై స్వయంగా మృణాల్ స్పందిస్తూ మీ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతున్నందుకు సారీ. ఈ ప్రాజెక్టులో నేను లేను అని క్లారిటీ ఇచ్చింది. దీంతో మృణాల్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. హను రాఘవపూడి ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.













