Spirit: ప్రభాస్ కు జోడీగా ఆ హీరోయిన్?
స్పిరిట్(spirit) షూటింగ్ ఇంకా స్టార్ట్ అవలేదు కానీ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రం చాలా వేగంగా జరుగుతున్నట్లు ముంబై వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం రాజా సాబ్(raja Saab), ఫౌజీ(Fouji) షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న ప్రభాస్(Prabhas) ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్క్రిప్ట్ ను లాక్ చేసినట్లు సమాచారం.
ఫైనెల్ నెరేషన్ అయ్యాక షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీతారామం(Sitaramam) బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే డిస్కషన్స్ జరిగాయని, సందీప్ ఓకే అనుకుంటే వెంటనే అగ్రిమెంట్ రాసుకుంటారని తెలుస్తోంది. మొదట స్పిరిట్ హీరోయిన్ కోసం రెండు మూడు పేర్లు వినిపించాయి.
కానీ భార్య పాత్ర కాబట్టి మృణాల్ అయితేనే బావుంటుందని సందీప్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో సైఫ్(Saif), కరీనా(Kareena) నెగిటివ్ రోల్స్ చేస్తున్న వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎంతకైనా తెగించే ఓ వయొలెంట్ పోలీసాఫీసర్ కథను ఇందులో చూపించబోతున్నట్లు సందీప్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameswar) ఇప్పటికే ఓ దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













