బాలీవుడ్ ను ఫోకస్ చేసిన మృణాల్
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత నానితో హాయ్ నాన్న చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మృణాల్ కు ఎన్నో ఆఫర్లొచ్చినప్పటికీ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది మృణాల్. కానీ విజయ్ తో చేసిన ఫ్యామిలీ స్టార్ మాత్రం అమ్మడుకి తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మృణాల్ ఫోకస్ అంతా ఎక్కువగా బాలీవుడ్ మీదే పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి విశ్వంభరలో ఆఫర్ వచ్చినా ఆ సినిమాకు ఎక్కువ డేట్స్ అవసరమైతే మళ్లీ బాలీవుడ్ ఛాన్స్ లకు ఇబ్బందవుతుందని నో చెప్పినట్లు టాక్. మృణాల్ ప్లానింగ్ కు తగ్గట్టే తాజాగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సిద్దాంత్ చతుర్వేది హీరోగా, రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా లవ్ స్టోరీ అయినప్పటికీ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ పాయింట్ తో ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలనే ఆలోచనతోనే మృణాల్ సౌత్ నుంచి వచ్చిన రెండు ఆఫర్లకు నో చెప్పిందని టాక్. ఇవన్నీ చూస్తుంటే మృణాల్ ఫోకస్ మాత్రం ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉందన్న విషయం అర్థమవుతుంది.













