లక్ అంటే మృణాల్దే!
సీతారామం(Sitaramam) సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కు ఆ సినిమా విజయం బాగా కలిసొచ్చింది. సీతారామం తర్వాత మృణాల్ నటించిన హాయ్ నాన్న(Hi Nanna) కూడా మంచి విజయాన్ని అందించడంతో తన జోష్ డబుల్ అయింది. మృణాల్ హీరోయిన్ గా టాప్ లీగ్ లోకి వెళ్తుందనే టైమ్ కు వచ్చిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star) డిజాస్టర్ అవడం వల్ల అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి.
మామూలుగా అయితే కంగువ(kanguva)లో సూర్య(Suriya)కు జోడీగా ముందు మృణాల్నే అనుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ అవకపోవడం వల్ల ఆ ఛాన్స్ దిశా పటానీ(Disha Patani)కి వెళ్లింది. అయితే కంగువలో హీరోయిన్ పాత్ర ఉండేది చివరి 20 నిమిషాలే అని తెలియడంతో మృణాల్ నష్టపోయిందేమీ లేదని అంతా అనుకున్నారు. అలా అని సూర్య పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుందనుకుంటే పప్పులో కాలేసినట్టే.
సూర్య హీరోగా ఆర్జె బాలాజీ(RJ Balaji) దర్శకత్వంలో సూర్య చేయనున్న ఫాంటసీ థ్రిల్లర్ లో మృణాల్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ త్వరలోనే క్లారిటీ రావొచ్చు. ఏదేమైనా సౌత్ లో కెరీర్ డల్ అయిన టైమ్ లో మృణాల్ కోలీవుడ్ డెబ్యూ ఏకంగా సూర్యతో జరుగుతుందంటే అమ్మడి లక్ మామూలుగా లేదనే అనుకోవాలి.













