మిస్టర్ బచ్చన్ లో హైలైట్ అదే!
రీసెంట్ గా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ సినిమాతో ఫ్యాన్స్ కు నిరాశే మిగిల్చాడు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై ఉంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. రవితేజ ఈ సినిమాలో ప్రభుత్వ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ రైడ్ సినిమా కథాంశాన్ని తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి హరీష్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవితేజ మాస్, యాక్షన్ యాక్టింగ్ సినిమాకు హైలైట్ అవ్వబోతున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
గతంలో రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకున్న హరీష్ శంకర్ ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అని రవితేజ ఫ్యాన్స్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు బ్రేక్ రావడంతో హరీష్ శంకర్ ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యే నాటికి ఈ సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.













