సంక్రాంతి వార్ వన్ సైడ్..
2023 సంక్రాంతి వార్ వన్ సైడ్‌గా మారిందా అంటే థియేటర్ల వద్ద ప్రేక్షకులు కురిపిస్తున్న కాసులు అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఈ సంక్రాంతి పోటీలో మొత్తం ఐదు సినిమాలు సైరన్ మోగించాయి. అందులో ఇద్దరు హీరోలు నందమూరి బాలకృష్ణ చిరంజీవి నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, మూడవది యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం.
ఇవి కాక రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు. వాటిలో ఒకటి విజయ్ హీరోగా నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు. ఈ ఐదు సినిమాల్లో బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి, మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డిని జనవరి 12న రిలీజ్ చేస్తే, చిరంజీవి నటించన వాల్తేరు వీరయ్యని జనవరి 13న రిలీజ్ చేశారు. రెండు సినిమాల్లో బాలయ్య మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తే, వాల్తేరు వీరయ్యని బాబీ డైరెక్ట్ చేశాడు.
అంచనాలు పెరిగిపోవడంతో ఈ రెండు సినిమాల బడ్జెట్లు కూడా బాగా ఎక్కువగా పెరిగాయి. దీంతో ఈ రెండు సినిమాలను కూడా మైత్రీ సంస్థే నైజాంలో రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలతో మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా మొదటిసారి అడుగుపెట్టింది. ఈ రెండు సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీని చేశారు. అందుకోసం భారీగానే ఖర్చు చేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు అనుకున్న దానికంటే ఎక్కువ బజ్ క్రియేట్ అయింది. దీంతో వీరసింహా రెడ్డి అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డు క్రియేట్ చేసింది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య పరిస్థితి ఇందుకు భిన్నంగా మరింత దూకుడుగా కనిపిస్తోంది. మొదట్లో కొంత నెగిటివ్ టాక్ వినిపించినా ఓపెన్సింగ్స్ పరంగా ఆ తరువాత రోజుల వసూళ్ల పరంగా ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ వీరసింహా రెడ్డిని అధిగమించేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సంక్రాంతి విజేతగా ఈ సారి చిరూ నిలిచాడు. మైత్రీ ఈ రెండు సినిమాలని పెద్ద మొత్తాలకు వేరే ఏరియాల్లో అమ్మడం, అనుకున్న విధంగా రికవరీ అవుతుండటంతో అంతా హమ్మయ్యా అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో పోటీకి దిగిన దిల్ రాజు మూవీ తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది. ముందు ఈ సినిమాలకు పోటా పోటీగా రిలీజ్ చేయాలని ప్రయత్నించినా ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గిన దిల్ p 12నుంచి వారసుడుని 14కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంతే కాదు తమిళ్ వెర్షన్ ను ప్రమోట్ చేసినట్లు దిల్ రాజు ఈ సినిమను తెలుగులో ప్రమోట్ చేయలేదు. హీరో విజయ్ సపోర్ట్ చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వారసుడు ప్రమోషన్స్ అనేది సినిమా రిజల్ట్ లో పెద్ద మైనస్ అని తెలుస్తోంది. దీంతో సంక్రాంతి బరిలో మైత్రీ ముందు దిల్ రాజు ఫెయిల్ అయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













