మే 18 నుండి సినిమా థియేటర్లు తెరచుకోనున్నాయా?
నిన్న మందు బాబులకు ఫ్రీడమ్ వచ్చింది. రేపు సినిమా ప్రేమికులకు శుభవార్త రాబోతుంది లాక్ డౌన్ కారణంగా మార్చి 18 నుంచి మూతపడిన సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిహాల్స్, షాపింగ్ మాల్స్ వంటివి మూసివేసిన విషయం తెలిసిందే. అలాగే.. జన సమూహాలు ఎక్కువగా ఉండే జంక్షన్ లలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మూడు జోన్లుగా విభజించారు. రెడ్ జోన్ పరిధిలో కఠిన నిబంధలు అమలు చేస్తూ…ఆరెంజ్ జోన్లో కొంత మేర సడలింపు నిచ్చింది ప్రభుత్వం.
అందుకు సంబంధించి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని నిర్ధారించుకున్న తర్వాత గ్రీన్ జోన్లలో కార్యకలాపాలను మెల్లిమెల్లిగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే… ఈ నెల 18వ తేది నుంచి సినిమా థియేటర్లకు కూడా అనుమతించే అవకాశం ఉంది అనే టాక్ నడుస్తోంది. ఇంకా లాక్డౌన్ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించే దిశగా ప్రణాళికలను రెడీ చేస్తుంది. ఇటీవల వైన్ షాపులకు అనుమతి ఇవ్వడం లాంటివి. ఈనెల 18నుంచి గ్రీన్ జోన్ లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ప్రకటన కూడా ప్రధాని నరేద్ర మోడీ ఈ రోజు (12. 05. 2020) రాత్రి 8గంటలకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ మినహా గ్రీన్ జోన్ లో మూడు ఆటలకు మాత్రమే అనుమతులివ్వనుంది ప్రభుత్వం. అంతేకాకుండా రాత్రి 7 గంటలలోపు మూడు ఆటలు పూర్తి కావాలనే నిబంధన విధించనుందనే టాకా కూడా వినిపిస్తోంది. అలాగే సినిమా హాల్స్ లో సీటుకి సీటు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలని సూచించనుంది. అంటే 1000 సీటులున్నా థియేటర్లో 500 టికెట్స్ మాత్రమే విక్రహిస్తారన్నమాట.
ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని నిబంధన విధించింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. అంతే కాకుండా థియేటర్ లోపలికి బయటకు వచ్చేటపుడు సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలి. గ్రీన్ జోన్స్ లోని మాల్స్ లలో కూడా ఇదే తరహా నిబందనలు అమలు చేయనుంది ప్రభుత్వం. కాగా షాపింగ్ మాల్స్ కూడా సాయంత్రం 7 గంటల లోగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రతి షో పూర్తి అయినా వెంటనే ఆడిటొరియం మొత్తం సానీటిజషన్ చేస్తారు. మరి టాయిలెట్స్ వద్ద ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చూడాలి చూదాం ఈ రోజు రాత్రి 8 గంటలకు పెద్దాయన ఏం చేప్తాడో..













