Movie Shootings: షూటింగులతో హైదరాబాద్ కళకళ
ప్రస్తుతం భాగ్య నగరమైన హైదరాబాద్లో పలు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న సినిమాల్లో ఆల్మోస్ట్ అన్నీ సినిమాలూ హైదరాబాద్లోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన మూవీ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు(Harihara veeramallu). ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతుంది.
ఇక బాలకృష్ణ(Balakrishna)- బోయపాటి(Boyapati) కాంబోలో తెరకెక్కుతున్న అఖండ2(Akhanda2) షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో జరుగుతున్నట్టు సమాచారం. ది రాజా సాబ్(The Raja Saab) సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో జరుగుతుండగా, హను రాఘవపూడి(Hanu Raghavapudi)తో ప్రభాస్(Prabhas) చేస్తున్న ఫౌజీ(Fouji) షూటింగ్ కూడా హైదరాబాద్ నగర శివార్లలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో జరుగుతుంది. ఇందులో ప్రభాస్ కూడా పాల్గొంటున్నాడు.
గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి(Rajamouli)- మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ తో పాటూ నాని(Nani) హీరోగా వస్తున్న హిట్3(Hit3) సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. నిఖిల్(Nikhil) హీరోగా నటిస్తున్న స్వయంభు(Swayambhu) షూటింగ్ జన్వాడలో జరుగుతుంటే, సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) హీరోగా రానున్న సంబరాల ఏటిగట్టు(Sambarala Yeti Gattu) షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది.













