సినిమా షూటింగ్లు బంద్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్లను నిలిపివేస్తున్నట్టు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఫిల్మ్ చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినీనటులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుంచి ఈ నెల 21 వరకు అన్ని రకాల చిత్రీకరణలు నిలిపివేస్తున్నామన్నారు. 24 విభాగాల వారితో సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరోవైపు ఈనెల 19 నుంచి 31 వరకు అన్నిరకాల వినోదాత్మక ఫార్మాట్ల చిత్రీకరణను నిలిపేస్తున్నట్టు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.













