అమర జవాన్ల కుటుంబాలకు ‘మా’ విరాళం
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని మా ప్రకటించింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి.కె. నరేష్ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవాన్ల త్యాగం మరువలేనిదని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమరులైన జవాన్ల కుటుంబాలను ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.













