Mouni Roy: ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తూనే ఉంటా
సాధారణ వ్యక్తులను ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంత ఈజీగా దక్కదు. ఎన్నో కష్టాలు పడితే తప్పించి వారికి ఛాన్సులు రావు. అవకాశమొచ్చినా ప్రతీ ఒక్కరూ సక్సెస్ అవుతారనే గ్యారెంటీ కూడా లేదు. ఇక సక్సెస్ లేకపోతే మరో ఛాన్స్ కూడా రాదు. కానీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు మాత్రం దానికి అతీతమని, నార్మల్ పీపుల్ తో కంపేర్ చేస్తే వారికి ప్రతీదీ చాలా సులభంగా వచ్చేస్తుందని బాలీవుడ్ నటి మౌనీ రాయ్(mouni roy) చెప్పింది.
సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎంత పెద్ద హిట్ సినిమాలో నటించినా ఉపయోగముండదని చెప్పిన మౌనీ రాయ్, బయటి వ్యక్తులు ఛాన్సుల కోసం పోరాటం చేస్తూనే ఉండాలని, అందుకే తాను ఏ చిన్న ఆఫర్ వచ్చినా చేస్తానని చెప్పింది మౌనీ రాయ్. ఇప్పటికీ తాను ప్రతీ పాత్రకీ ఆడిషన్ ఇస్తానని ఆమె చెప్పారు. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో ఎవరూ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఛాన్సులు ఇవ్వాలని అనుకోరని, ఈ ఇండస్ట్రీలో బయటి వాళ్లు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. అవకాశాలు రావాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదని చెప్పింది. బ్రహ్మాస్త్ర(brahmastra) సినిమా తర్వాత తనకు వరసు అవకాశాలొస్తాయనుకున్నానని, కానీ ఆ మూవీ సక్సెస్ కూడా తనకు అవకాశాలు తీసుకురాలేదని తెలిపింది.







