Mouli: నానీ అన్నా! నీ గోడలో ఇటుక అవుతా

ఈ రోజుల్లో ఏ సినిమా ఆడాలన్నా దానికి కథ చాలా ముఖ్యం. కథ లేకపోతే ఎంత పెద్ద స్టార్ల సినిమా అయినా ఆడియన్స్ చూడటం లేదు. రీసెంట్ గా అలాంటి చిన్న సినిమా ఒకటి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. అదే లిటిల్ హార్ట్స్(little hearts). మౌళి తనూజ్(mouli thanuj) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజై మంచి టాక్ తో రన్ అవుతోంది.
ఈ సినిమాకు సాధారణ ఆడియన్స్ నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అందులో భాగంగానే లిటిల్ హార్ట్స్ మూవీని చూసిన నేచురల్ స్టార్ నాని(Nani) చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ చూసి మౌళి తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. దానికి రీజన్ మౌళికి నాని పై ఉన్న ఇష్టమే. ఈ విషయాన్ని మౌళి చాలాసార్లు చెప్పుకొచ్చాడు.
తన సినిమాను చూసి తన ఫేవరెట్ హీరో రెస్పాండ్ అవడం చూసి ఆనందలో మునిగిపోయిన మౌళి, నాని పోస్ట్ కు రిప్లై ఇస్తూ, చాలా థాంక్స్ నాని అన్నీ, నీకు తెలియకపోవచ్చు పిల్ల జమీందార్(pilla Jamindar) నుంచి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. నా వర్క్ గురించి మీకు తెలిశాకే మిమ్మల్ని కలుద్దామని ఫిక్స్ అయి, దాని కోసమే కష్టపడ్డా, ఇవాళ అది సాధించా, ఇప్పుడు కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నా ఏదొక రోజు నీ గోడలో ఇటుక అవుతా పక్కా అని రాసుకురాగా, నాని దానికి రెస్పాండ్ అవుతూ, ఏమో నీ గోడలో నేనే ఇటుకనవుతానేమో అంటూ రిప్లై ఇచ్చాడు. వారిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.