Mouli: పేరెంట్స్ తో ఫారిన్ ట్రిప్ వెళ్తానంటున్న మౌళి

90s వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన మౌళి(mouli) నటించిన తాజా సినిమా లిటిల్ హార్ట్స్(little hearts). శివానీ నాగారం(sivani nagaram) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. యూత్ ను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.
కాగా రీసెంట్ గా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మౌళి మాట్లాడుతూ, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటూ పుట్టినప్పటి నుంచి తన తల్లిదండ్రులకు తానెప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదని, ఇప్పుడే ఫస్ట్ టైమ్ స్టేజ్ పై నుంచే చెప్తున్నా అని థ్యాంక్స్ చెప్పాడు. తన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా తనను మాత్రం కింగ్ లానే పెంచారని మౌళి చెప్పాడు.
తన పేరెంట్స్ తననెంతో బాగా చూసుకున్నారని, ఇప్పటివరకు తన ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి తప్ప ఏ ట్రిప్ కూ వెళ్లలేదని, లిటిల్ హార్ట్స్ సినిమా హిట్ అయితే పేరెంట్స్ ను తీసుకుని ఫారిన్ ట్రిప్ కు వెళ్తానని చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి మౌళిని అభినందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రీమియర్లు పడి ఆ షో ల నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.