Daku Maharaj: డాకు మహారాజ్‌కు ఎర్లీ మార్నింగ్ షోలు?
ప్రభుత్వాలు మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ షోలకు, ఎక్స్ట్రా షోలకు ఈజీగా పర్మిషన్స్ వస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ పుష్ప2(Pushpa2) ప్రీమియర్ షో టైమ్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో తెలంగాణలో ఒక్కసారిగా సిట్యుయేషన్స్ మారిపోయాయి.
ఇకపై బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్స్ ఉండవని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatareddy) స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో గవర్నమెంట్ మరీ పట్టుదలకు పోదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలంతా ప్రభుత్వ పెద్దల్ని కలిసి సమస్యకు సొల్యూషన్ కనుగొంటారని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి సినిమా డాకు మహారాజ్(Daku Maharaj) నిర్మాత నాగవంశీ తమ సినిమాకు వేకువఝామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. మీ సినిమాకు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటానా అని ఆయన్ని అడిగితే తమ సినిమాకే కాదు, సంక్రాంతి సినిమాలు వేటికీ ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ఉండకపోవచ్చని ఆయన అన్నాడు. మరి అప్పటికి పరిస్థితులేమైనా అనుకూలిస్తాయో చూడాలి.













