టాలీవుడ్ లో మోక్షజ్ఞ, బాలీవుడ్ లో ఆర్యన్ ఖాన్
టాలీవుడ్ లో నందమూరి మోక్షజ్ఞ, బాలీవుడ్ ఆర్యన్ ఖాన్ డెబ్యూ సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ అగ్ర కుటుంబాల నుంచి వస్తున్న హీరోలుగా ఈ ఇద్దరిపైనా చాలానే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వారి లాంచింగ్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే వీరిద్దరి లాంచింగ్ గురించిన సస్పెన్స్ ఇప్పుడు నెమ్మదిగా వీడుతోంది.
బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచింగ్ రేపు జరగనుంది. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత మోక్షు డెబ్యూకి ఇప్పటికి ముహుర్తం కుదిరింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ కూడా గెస్ట్ రోల్ లో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞతో పోలిస్తే ఆర్యన్ ఖాన్ సినీరంగ ప్రవేశంపై కొంత క్లారిటీ ఉంది.
ముందు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాకే హీరోగా లాంచ్ అవ్వాలని చూస్తున్నాడట ఆర్యన్ ఖాన్. ఇప్పటివరకు ఆర్యన్ ఖాన్ తాను హీరో అవుతానని ఎప్పుడూ చెప్పింది లేదు. అతడి కోసం పలువురు ప్రముఖ డైరెక్టర్లు లైన్ లో ఉన్నారు కానీ ఖాన్ అందరూ వెయిట్ చేస్తుంది ఖాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే. కొంత టైమ్ పట్టొచ్చేమో కానీ ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలకృష్ణ లెగసీని ముందుకు తీసుకెళ్లే హీరోగా మోక్షజ్ఞ, షారుఖ్ లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడిగా ఆర్యన్ తమను ప్రూవ్ చేసుకుని రాణించాల్సి ఉంది.













