టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో వారసుడి ఎంట్రీ బాధ్యతలు
గత 20 ఏళ్లలో టాలీవుడ్ లో ఎంతో మంది వారసుల వెండితెర అరంగేట్రాలు అయ్యాయి. కానీ నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. వాస్తవానికి మోక్షజ్ఞ ఆరేడేళ్ల కిందటే హీరోగా పరిచయమవాల్సింది కానీ ఎన్నో కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఒక దశలో మోక్షుకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదన్నారు. అతను తెరంగేట్రం చేయకపోవచ్చని కూడా అన్నారు. దానికి తగ్గట్టే ఆ టైమ్ లో మోక్షజ్ఞ అవతారం కూడా ఉంది. కానీ ఇప్పుడలా కాదు. మోక్షజ్ఞ లుక్స్ నుంచి అన్నీ మారాయి. ఇంతకుముందు సెట్స్ కు రాని మోక్షజ్ఞ ఇప్పుడు తన తండ్రి సినిమా సెట్స్ లో కనిపిస్తున్నాడు. డైరెక్టర్లతో కలిసి ఫోటోలకు పోజులిస్తున్నాడు.
ఇప్పుడు మోక్షజ్ఞ లుక్స్ చూస్తే అతని ఎంట్రీ అతి త్వరలోనే ఉండనుందని అర్థమవుతుంది. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం ఎన్నో ఆప్షన్స్ పరిశీలించిన బాలయ్య, చివరికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఆ ఛాన్స్ ను ఇచ్చాడని తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ తో సినిమా చేయాల్సిన ప్రశాంత్ వర్మకు ఆ సినిమా క్యాన్సిల్ అవడంతో కాస్త ఫ్రీ అయ్యాడు. ఈ టైమ్ లోనే బాలయ్య, ప్రశాంత్ మధ్య డిస్కషన్స్ జరిగాయని, ప్రశాంత్ వర్మ కూడా దీనికి ఓకే అన్నాడని తెలుస్తోంది. బాలయ్య సొంత ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా రూపొందనుండగా, ఆయన చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది.













