Mohith Suri: సందీప్ రెడ్డి వంగాకు సైయారా డైరెక్టర్ థ్యాంక్స్
చిన్న సినిమాగా రిలీజైన బాలీవుడ్ లవ్ మూవీ సైయారా(Syeyara) మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. బాలీవుడ్ లో లవ్ ఫిల్మ్ వచ్చి చాలా కాలమవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. జులై 18న రిలీజైన సైయారా ఇప్పటికే రూ.150 కోట్లు కలెక్ట్ చేసి మంచి హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి(Mohith Suri) టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)కు థ్యాంక్స్ చెప్పారు.
సైయారా సినిమా ట్రైలర్ రిలీజవగానే దాన్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయిన సందీప్ రెడ్డి వంగా సైయారా ట్రైలర్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, సైయారాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని, ఈ సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి చేసిన మ్యాజిక్ అని ట్వీట్ చేశారు. సందీప్ అన్నట్టే సైయారాతో మోహిత్ సూరి ఏదో మ్యాజిక్ చేశారు.
సైయారా హిట్టైన సందర్భంగా మోహిత్, సందీప్ కు థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాను అందరికంటే ముందు నమ్మిన వ్యక్తి సందీప్ అని, ఈ మూవీకి ముందు సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయనేనని, ఓ డైరెక్టర్ గా సందీప్ ను తానెంతో అభిమానిస్తానని, ఆయన్ని స్పూర్తిగా తీసుకుంటానని, ఆయన లాంటి వారి అడుగుజాడల్లో నడవడం ఎంతో గర్వంగా ఉందని, ఎప్పటికీ ఆయనకు అభిమానినే అంటూ మోహిత్ సూరి, సందీప్ రెడ్డి వంగాను ఉద్దేశిస్తూ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.







