Mohan Lal: దోశ కింగ్ గా మోహన్ లాల్

మలయాళ నటుడు మోహన్ లాల్(mohan lal) ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నారు. లూసిఫర్2(lucifer2), తుదరమ్(thudaram), హృదయపూర్వం(hridayapoorvam) సినిమాలతో హ్యాట్రిక్ లు అందుకున్న ఆయన ఇప్పుడు జై భీమ్(jai bheem), వేట్టయాన్(vettayan) ఫేమ్ టి.జె. జ్ఞానవేల్(TG Gnanavel) తో కలిసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని శరవన భవన్ (Saravana Bhavan)హోటల్ యజమాని రాజగోపాల్(raja gopal) జీవిత కథ ఆధారంగా మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం.
రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన రాజగోపాల్ ఎలాంటి చదువు లేకపోయినా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన వ్యాపారన్ని విస్తరింపచేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన లైఫ్ జర్నీ చాలా సక్సెస్‌ఫుల్ స్టోరీ. కానీ జాతకాలపై ఉన్న పిచ్చి అతనెంతో కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్టల్ని మంటలో కలిపింది. ఆ పిచ్చి వల్లే ఆయన హంతకుడిగా మారి జైల్లో ఉండాల్సి వచ్చింది.
రాజగోపాల్ జీవితంలో చాలా కోణాలున్నాయి. అలాంటి స్టోరీని ఆడియన్స్ కు అందించాలని జ్ఞానవేల్ చాలా కాలంగా ప్రయత్నిస్తుండగా అది ఇప్పటికి కుదిరిందని, జంగ్లీ పిక్చర్స్(Junglee pictures) అనే సంస్థ ఈ మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తుందని, ఈ సినిమాకు దోశ కింగ్(dosa king) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. హంతకుడైన రాజగోపాల్ పాత్రలో మోహన్ లాల్ నటిస్తారని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పై అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.