Mohanlal: ఎల్2 కోసం మోహన్ లాల్ రెమ్యూనరేష్ ఎంతో తెలుసా?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohan Lal) క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ఎల్2: ఎంపురాన్(L2 Empuraan). ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) తో కలిసి మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో మోహన్ లాల్ తన 47 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయన్నారు.
బాక్సాఫీస్ నెంబర్ల గురించి తాను పట్టించుకోనని, తన కెరీర్లో రూ.100 కోట్ల సినిమాలు చాలా ఉన్నాయని, కానీ అన్నింటికంటే అభిమానుల ప్రేమ, అభిమానమే ముఖ్యమని ఆయన తెలిపారు. మలయాళ ప్రేక్షకులు ఎంతో గొప్పవారని, మంచి కంటెంట్ ను వారెప్పుడూ ఆదరిస్తారని, అందుకే తనకు వేరే భాషలో సినిమాలు చేయాలనిపించలేదని తెలిపారు.
అదే ఇంటర్వ్యూలో డైరెక్టర్ పృథ్వీరాజ్, ఎల్2: ఎంపురాన్ తెరకెక్కిందంటే దానికి ముఖ్య కారణం మోహన్ లాలే అని, ఈ మూవీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, కష్టపడటమే కాకుండా ఈ సినిమాకు ఆయన కనీసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని, ఆయనకు ఇవ్వాల్సిన డబ్బును కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టామని వెల్లడించారు. ఎల్2 తప్పక ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని పృథ్వీరాజ్ అన్నారు.













