Mohan Lal: క్షమాపణలు చెప్పిన మోహన్ లాల్..
మోహన్ లాల్(Mohan Lal) హీరోగా లూసిఫర్(Lucifer) సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఎల్2: ఎంపురాన్(L2: Empuraan). మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi Raj Sukumaran) దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎవరూ అనుకోని రీతిలో ఎల్2 చిక్కుల్లో పడింది.
ఈ మూవీలోని కొన్ని సీన్స్ గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండటంతో ఎల్2పై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఎల్2 అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో సెన్సారు బోర్డు ఎల్2 మూవీలో 17 సీన్స్ కు రీ ఎడిటింగ్ చేయాలని మేకర్స్ కు సూచించగా, తాజాగా ఈ విషయంలో మోహన్ లాల్ స్పందించారు.
ఎల్2: ఎంపురాన్ సినిమాలోని కొన్ని సీన్లు ఆడియన్స్ ను చాలా బాధ పెట్టాయన, మీ మనసుల్ని నొప్పించినందుకు నన్ను క్షమించమని కోరుతున్నానని, చిత్ర యూనిట్ తరపున కూడా నేనే క్షమాపణలు చెప్తున్నానని, ఆడియన్స్ ను బాధ పెట్టే సీన్స్ ను తొలగించాలని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామని, గత 40 ఏళ్లుగా ఆడియన్స్ లో ఒకడిగా నా సినీ జర్నీని కొనసాగించానని మీ ప్రేమ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదని తెలుపుతూ మోహన్ లాల్ పోస్ట్ చేశారు. మోహన్ లాల్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.













