శివ కార్తికేయన్ సినిమాలో పాన్ ఇండియా స్టార్లు
కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో శివ కార్తికేయన్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్‌లో ఒక సినిమాను చేస్తున్నాడు. దాని తర్వాత శివ కార్తికేయన్ మరో క్రేజీ ఫిల్మ్ కు కూడా కమిట్ అయ్యాడు. మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఇప్పటికే సినిమాను అనౌన్స్ చేశాడు.
ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. మలయాళ సూపర్‌స్టార్ మొహన్ లాల్ కీలకపాత్రలో నటించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విద్యుత్ జమ్వాల్ కూడా కనిపించబోతున్నాడట. వీరిద్దరూ ఈ సినిమాలో నటిస్తుండటం వల్ల దీనికి పాన్ ఇండియా సినిమా అనే ఫీలింగ్ వస్తోందంటూ మీడియా వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.
దానికి తోడు హీరోయిన్ గా శివ కార్తికేయన్ కు జోడీగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు. వివిధ భాషల నుంచి క్రేజీ నటులు ఈ సినిమాలో నటిస్తుండటం వల్ల ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. నటీనటుల ఎంపికతోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ నాటికి మరింత హైప్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.













