Jailer2: జైలర్2లో మోహన్ లాల్ జాయిన్ అయిదప్పుడే!

రజనీకాంత్(rajinikanth) హీరోగా నెల్సన్(nelson) దర్శకత్వంలో వచ్చిన జైలర్(Jailer) సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న రజినీకి జైలర్ మంచి ఊరటనిచ్చింది. జైలర్ సినిమా సుమారు రూ.650 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. జైలర్ లో మోహన్ లాల్(mohanlal), జాకీ ష్రాఫ్(Jockey Shroff), శివరాజ్ కుమార్(Sivaraj kumar) గెస్ట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.
జైలర్ సక్సెస్ అవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా జైలర్2(Jailer2) ను ప్లాన్ చేసిన మేకర్స్ రీసెంట్ గానే ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. జైలర్ లో నటించిన మోహన్ లాల్(Mohanlal) ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు రాగా, ఇప్పుడు మోహన్ లాల్ కు సంబంధించిన ఓ అప్డేట్ వినిపిస్తోంది.
మోహన్ లాల్ చెన్నై వెళ్లి జైలర్2 షూటింగ్ లో జాయిన్ అయ్యారని వార్తలొస్తున్నాయి. కానీ ఈ విషయంలో జైలర్2 టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. అయితే జైలర్2 సెట్స్ లో జులై ఆఖరి నుంచి మోహన్ లాల్ చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మోహన్ లాల్ సెట్స్ లో జాయిన్ అయితే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్సుంది. జైలర్2 కు కూడా అనిరుధ్ రవిచందరే సంగీతం అందిస్తున్నారు.