Mohan Lal: గాడ్ ఫాదర్ సీక్వెల్ కు అవకాశమే లేదు
మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ఎల్2: ఎంపురాన్(L2: Empuraan). మోహన్ లాల్(Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన లూసిఫర్(Lucifer) కు సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్ రూపొందింది. ఇదిలా ఉంటే లూసిఫర్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్(God Father) పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ ఫ్లాప్ అయింది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ సినిమా తెలుగు థియేటర్లలో రిలీజవడంతో పాటూ గాడ్ ఫాదర్ ఫ్లాప్ కు కారణమని చెప్పొచ్చు. ఆల్రెడీ మోహన్ లాల్ హీరోగా చూసిన సినిమాను మళ్లీ థియేటర్లకు వెళ్లి ఏం చూస్తాంలే అని ఆడియన్స్ గాడ్ ఫాదర్ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఎల్2: ఎంపురాన్ ప్రమోషన్స్ లో మోహన్ లాల్ మాట్లాడుతూ, ఒరిజినల్ కథను తెలుగు వెర్షన్ లో కొంచెం మార్చారని, లూసిఫర్ తెలుగు వెర్షన్ కు సీక్వెల్ చేసే ఛాన్స్ లేదని ఆయన అన్నారు. లూసిఫర్ లో ఉన్న కొన్ని పాత్రలు గాడ్ ఫాదర్ లో లేకపోవడం వల్ల ఎల్2 ను తెలుగులో రీమేక్ చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు.













