Ram Pothineni: రామ్ మూవీలో మలయాళ సూపర్ స్టార్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothieni)కి ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) తర్వాత మరో సక్సెస్ లేదు. అవసరానికి మించి ట్రై చేసిన మాస్ ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీంతో ఇప్పుడు రామ్ తనకు బాగా సూటయ్యే జానర్ లోకి వచ్చి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్, మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr. Polishetty) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు మహేష్ బాబు. రామ్ కెరీర్లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Thaluka) అనే టైటిల్ ను మేకర్స్ ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆంధ్రా కింగ్ అంటే రామ్ కాదు, మరొకరు. హీరో ఆయన తాలూకా అని వచ్చేలా టైటిల్ ను పెట్టారు.
అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఈ మూవీలో ఓ సీనియర్ హీరో ఉంటాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సీనియర్ హీరో కోసం మహేష్ బాబు ఇప్పటికే కమల్ హాసన్(Kamal Haasan), బాలకృష్ణ(Balakrishna)ను సంప్రదించినప్పటికీ వారి కాల్షీట్స్ ఖాళీ లేకపోవడంతో ఆఖరికి ఆ పాత్ర మోహన్ లాల్(Mohan Lal) దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ డేట్స్ ఫైనల్ అయ్యాక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













