Mega158: చిరూ మూవీలో మలయాళ సూపర్ స్టార్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికే విశ్వంభర(viswambhara) షూటింగ్ ను ఫినిష్ చేసిన చిరూ(chiru), ప్రస్తుతం అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడు అనిల్.r
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీని నవంబర్ ఎండింగ్ కు ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత చిరూ, బాబీ కొల్లి(bobby kolli) దర్శకత్వంలో తన 158వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని చిరూ బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేయగా, ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
మెగా158(mega158)లో ఓ పవర్‌ఫుల్ పాత్ర కోసం మేకర్స్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(mohan lal) ను తీసుకోవాలనుకుంటున్నారని, మోహన్ లాల్ ఈ ప్రాజెక్టులో భాగమైతే సినిమాకు మరింత క్రేజ్, హైప్ వస్తాయని డైరెక్టర్ బాబీ అనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. కాగా మెగా158 నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో మొదలై, వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం.