భక్తవత్సలం నాయుడుగా మోహన్‌బాబు
మంచు మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. అపర్ణ బాలమురళి నాయిక. గురు చిత్రంతో దర్శకురాలిగా ప్రతిభచాటిన సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎయిర్ దక్కన్ అనే విమానయాన సంస్థను స్థాపించి సామాన్యులకు సామానుయల గగన విహార కలను నిజం చేసిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమా తెరకెక్కుతోంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యం వహిస్తోంది. అకాశం నీ హద్దురా చిత్రంలో మోహన్‌బాబు ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు భక్తవత్సలం నాయుడు. మోహన్‌బాబు సొంత పేరు అదే. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.













