మోహన్‌బాబుకు డాక్టరేట్ ప్రదానం
ప్రముఖ సినీ నటుడు ఎం.మోహన్‌బాబుకు చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంజీఆర్ వర్సిటీ 26వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2,197 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అలాగే విద్యారంగానికి విశిష్ట సేవలు అందించినందుకుగాను మోహన్ బాబుకు గవర్నర్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తనకు సినీ జన్మనిచ్చిన రాష్ట్రం తమిళనాడని అన్నారు. ఎంజీఆర్ పేరు మీదుగా ఉన్న విశ్వవిద్యాయం నుంచి డాక్టరేట్ పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.













