మలేషియా డిప్యూటీ మంత్రికి థ్యాంక్స్ : మోహన్‌బాబు
మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర చిత్రీకరణ జరుగుతుండగా హీరో మంచు విష్ణు గాయపడిన సంగతి తెలిసిందే. బైక్ పై నుంచి కింద పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం విష్ణు అక్కడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి మోహన్ బాబు సకాలంలో సాయం చేసి విష్ణుకి మెరుగైన చికిత్స అందించేలా చేసిన మలేషియా డిప్యూటీ మంత్రి ఎస్.కె.దేవమణికి కృజ్ఞతలు తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణు ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిపోయారు. మెడ, భుజంపై గాయాలు కావడంతో ఆయన్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష్ణుకి చిన్నపాటి గాయాలయ్యాయని, కంగారుపడాల్సిన అవసరమేమీ లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.













