విలక్షణ నటుడు మోహన్ బాబు ‘శకుంతలం’ లో దుర్వాస మహర్షి?
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ‘ఒక్కడు’ లాంటి మాస్టర్ పీస్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్. సూపర్ మహేష్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా ఇప్పటికి సూపర్ స్టార్ అభిమానులతో పాటు మిగతా హీరోల అభిమానులని కూడా ఉర్రూతలూగిస్తుంది. అలాంటి సినిమాని తెరపైకి తీసుకొచ్చిన గుణశేఖర్ ఆ తరువాత ఎందుకో ఆ రేంజ్ హిట్ ని అందుకోలేక సతమతమవుతున్నాడు. ‘రుద్రమదేవి’ సినిమాతో మంచి పేరు దక్కించుకున్న కాని ఆ సినిమాతో కమర్షియల్ గా దెబ్బతిన్నాడు. ఇప్పుడు సమంతని మెయిన్ గా పెట్టి ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నాడు. ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడుగా కనిపించనున్నాడు.
సోమవారం నాడు ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో శకుంతల పాత్ర ఎంత కీలకమో.. దుర్వాస మహర్షి పాత్ర కూడా అంతే ముఖ్యమైంది. దీనికోసం సీనియర్ నటుడిని తీసుకోవాలని భావించిన చిత్రబృందం..మోహన్ బాబుని రంగంలోకి దించాలని చూస్తుంది. ఇటీవల విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో మోహన్ బాబు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చేసారు. సన్ అఫ్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.













