మోహన్‌బాబు మరోసారి దాతృత్వం
విలక్షణ నటుడు డా.మంచు మోహన్‌బాబు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఆయన కృషి చేస్తున్నారు. పెద్ద కుమారుడు విష్ణుతో కలిసి ఆంధప్రదేశ్‌లోని చంద్రగిరి మండలంలో మోహన్‌బాబు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 10 గ్రామాలకు మంచు కుటుంబం ప్రతిరోజూ 8 టన్నుల కాయగూరలు సరఫరా చేస్తోంది. అలాగే 800 మంది నిరుపేదలకు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం పెడుతున్నారు. అనారోగ్యంతో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. లాక్డౌన్ తొలగించే వరకు ఈ సేవలు సదుపాయాన్ని కొనసాగించాలని మోహన్‌బాబు నిర్ణయించుకున్నారని సమాచారం.













