Mohan Babu: ఆస్తులమ్మి మరీ ఆ సినిమా తీశా
మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) నటిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప(Kannappa). పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్నట్టు తెలిపారు కానీ ఇప్పుడు ఈ సినిమా కొన్న కారణాల వల్ల వాయిదా పడింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న మోహన్ బాబు తన పర్సనల్ లైఫ్ గురించి, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడారు.
లైఫ్ లో ఎన్నో ఎదుర్కొని మరీ ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపిన మోహన్ బాబు, ఎవరికీ చెప్పకుండా 4 కి.మీ నడుచుకుంటూ వెళ్లీ మరీ రాజమకుటం(Raja Makutam) అనే మూవీ చూసినట్టు తెలిపారు. స్వర్గం- నరకం(Swargam – Narakam) సినిమాలో విలన్ గా నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాను తర్వాత నిర్మాతగా మారానని, తన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి ఎంతో మొండిగా మేజర్ చంద్రకాంత్(Major Chandrakanth) సినిమా చేసి సక్సెస్ అందుకున్నట్టు తెలిపారు.
పాలిటిక్స్ తనకు అసలు సెట్ అవవంటున్న మోహన్ బాబు, తానెప్పుడూ ఎవరికీ అపకారం చేయలేదని, తననే ఎంతోమంది మోసం చేశారని, అప్పట్నుంచే తనకు ఆవేశం పెరిగిందని అన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోనంటున్న ఆయన అసలు ఒకరిని ట్రోల్ చేయడం వల్ల వాళ్లకేం వస్తుందో తనకు అర్థం కావడం లేదని అంటున్నారు.













