చిరంజీవి, నాగార్జునలకు ప్రధాని మోడీ ప్రశంశలు
కరోనాపై తమ సృజనాత్మకతతో తెలుగు సమాజాన్ని చైతన్యపరుస్తున్న ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు వర్తమాన హీరోలు వరుణ్‌తేజ్, సాయితేజ్‌లను ప్రధాని మోడీ ప్రశంసించారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంలో చిరంజీవి, నాగార్జున ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.
ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనాను పారదోలేందుకు ప్రధాని మోడీ 21 రోజుల లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే రేపు ఏప్రిల్ 5 రాత్రి 9 ఘంటలకు వారి వారి ఇండ్లనుండి జ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో ఇళ్లలోనే ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిరు, నాగ్‌తో పాటు వరుణ్‌తేజ్, సాయితేజ్ కలసి సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో రూపొందించిన ఓ ప్రత్యేక సాంగ్‌లో నటించారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి సామాజిక దూరం పాటించాలని ఆ పాట ద్వారా కోరారు. అలాగే పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అర్థవంతమైన రచనతో రమణీయమైన సంగీతం తో వారి వారి ఇళ్ళనుండి షూట్ చేసిన ఆ పాట బాగా వైరల్ అయింది. ఈ పాట మన ప్రధాని దృష్టికి వెళ్లింది. దానికి ఇన్స్ఫైర్ చేసిన ఆ పాట గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ…ఆ పాటలో నటించిన చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్, సాయితేజ్‌లను అభినందిస్తూ తెలుగులో ఆయన ట్వీట్ చేశారు.













