24న మోదీ వచ్చేస్తున్నాడు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పీఎం నరేంద్ర మోదీ. వివేక్ ఒబెరాయ్.. మోదీ పాత్రలో నటించారు. ఒమంగ్ కుమార్ దర్శకుడు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం (ఈ నెల 24న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. హిందీ, తెలుగు సహా 23 భాషల్లో విడుదల చేస్తున్నారు. మోదీ బాల్యంలో ఛాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించడం, యవ్వనంలో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవడం, ఆ తర్వాత ఆరెస్సెస్‌లో చేరడం, అనంతరం రాజకీయ రంగంలో సంచలనం సృష్టించడం లాంటి విషయాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. మోదీ ఆధ్వర్యంలో జరిపిన మెరుపు దాడులనూ చూపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.













