ఎంఎంఒఎఫ్ ట్రైలర్ విడుదల
శ్రీమతి అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ బ్యానర్లో జేడీ కాశీం నిర్మాతగా జెడి చక్రవర్తి, బెనర్జీ, మనోజ్ నందన్, అక్షత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎంఎంఒఎఫ్. ఈ చిత్రం ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ట్రైలర్ చూశానని, నేను స్లో అయినా, సినిమా తీసినవారు ఫాస్ట్‌గా ఉన్నారా అనే అనుమానం కలిగిందన్నారు. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉందన్నారు. ఆడియోన్స్ కు సినిమా చూడాలన్పించేలా ఉందన్నారు. జెడీ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ మూవీస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ మంచి కథ, కథనాలు బాగున్నాయని సినిమా చేశానని తెలిపారు. జెడీతో చాలా కాలం తర్వాత కలిసి నటించానని తెలిపారు. ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్ తో వస్తోందన్నారు.













