Keeravani: ఆ పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నా: కీరవాణి
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani) అందుకున్న ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకు సాంగ్స్ రాశారు. పాడారు కూడా. అయితే ఆయన సంగీత దర్శకుడు అవడానికి ముందు ప్లే బ్యాక్ సింగర్ కావాలనుకున్నారట. దాని కోసమే ఆయన మద్రాస్ కూడా వెళ్లారట.
కానీ అది కష్టమని తెలిసి, తర్వాత సంగీత దర్శకుడిగా సెటిలైపోయాడట. ఆ తర్వాత ఆయన సంగీతంలో ఎన్నో సినిమాలు చేయడంతో పాటూ, చాలా సాంగ్స్ కూడా పాడాడు. అయితే ఆయనకసలు ప్లే బ్యాక్ సింగర్ అవాలనే కోరిక పుట్టింది మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(Ilayaraja) సంగీతం వల్లేనట. ఎలాగైనా ప్లే బ్యాక్ సింగరై ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కు పాట పాడాలని ఎన్నో కలలు కన్నారట కీరవాణి.
అయితే మొదట్లో ఆయన కోరిక తీరలేదు కానీ తర్వాత ఓ డబ్బింగ్ సినిమా ద్వారా ఇళయరాజా మ్యూజిక్ లో పాట పాడే కోరిక తీర్చుకున్న కీరవాణి ఇప్పుడు ఇళయారాజా సంగీతం అందిస్తున్న పాటకు లిరిక్స్ అందించారు. రూపేష్(Rupesh), ఆకాంక్ష సింగ్(Akanksha Singh)జంటగా పవన్ ప్రభ(Pavan Prabha) దర్శకత్వంలో తెరకెక్కుతున్న షష్టిపూర్తి(Shashti poorthi) సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, అందులో ఏదో ఏ జన్మలోదో(Yedo Ye janmalodho) అనే పాటకు కీరవాణి లిరిక్స్ రాశారు. గతంలో ఎన్నో సాంగ్స్ రాసిన కీరవాణి, ఆస్కార్(Oscar) అందుకున్న తర్వాత రాసిన మొదటి పాట ఇదే కావడం విశేషం. ఇళయరాజా ట్యూన్ కు లిరిక్స్ రాసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు కీరవాణి రీసెంట్ గా ఓ వీడియో ద్వారా తెలిపారు.













