బాలయ్య పల్లెనిద్ర
ఎప్పుడూ సినిమా షూటింగులతోనే గడిపేస్తూ, తన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అంతా విస్తృత పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మూడు రోజుల పల్లె నిద్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. దిగువపల్లె ఎస్టీ తాండాలో బాలకృష్ణ పల్లె నిద్ర చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు, నేరుగా వారి వద్దకే వెళుతున్నట్టు ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయులు చెరువులు తవ్వించి రైతులను కన్నబిడ్డల్లా చూసుకోగా, ఈనాడు చంద్రబాబు చెరువులను నీటితో నింపి, వెనుకబడిన అనంతపురాన్ని ఆదుకొంటున్నారని కొనియాడారు.













