ఆ మహానీయుడి కథ భావితరాలకు అవసరం
నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా ఎన్టీఆర్. ఈ సినిమా జనవరి 9న విడుదల చేస్తామని బాలయ్య అన్నారు. తెలుగు జాతిని ప్రపంచ పటంలో ఎన్టీఆర్ ఎలా నిలబెట్టారనేదే చిత్ర ఇతివృత్తమని తెలిపారు. డైకెక్టర్ క్రిష్‌తో కలిసి నిమ్మకూరు వెళ్లిన బాలయ్య తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. నిమ్మకూరు అనేది ఆయన పుట్టిన ఊరు. వ్యక్తిగతంగా ఆయన సినిమా చేయడానికి కారణాలు..ఒకేటేమో ఒక నటుడిగా నాపై ఉన్న ప్రభావం. రెండవది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎన్టీఆర్ ఎన్నో పథకాలకు ఆయన నాంది పలికాడు. దేశం మొత్తం కూడా ఆ పథకాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి అలాంటి మహానీయుడి కథను భావితరాలకు అందజేయాలని నాకు అనిపించింది. క్రిష్, నా కలయికలో ఇది రెండో సినిమా.
ఎవరైతే వాళ్లు పుట్టిన కుటుంబానికి ఊరికి, జాతికి, దేశానికి ఖ్యాతిని తీసుకొస్తారే వాళ్లే మహానుభావులు అనిపించుకోవడానికి అర్హులు. వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఒక తండ్రి పాత్రలో కొడుకు నటించడమనేది చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం. కొడుకే తండ్రి జీవిత చరిత్రను నిర్మించడం. నిర్మాతగా నా మొదటి సినిమా కావడం. నా బ్యానర్లో తీయడం.. ఒక కాకతాళీయం. షెడ్యూల్లో భాగమే నిమ్మకూరు రావడం. క్రిష్‌కి నిమ్మకూరులోని మా బంధువులందరినీ పరిచయం చేశాను. తెలుగు జాతికే కాదు, దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది. నిమ్మకూరు అక్టోబర్ చివరిలో కానీ, నవంబర్ కానీ షూటింగ్ ఉంటుందని అని తెలిపారు బాలయ్య.













